మనుషుల్లో కరువైపోతున్న మానవత్వం

Update: 2021-01-23 09:33 GMT

మనుషుల్లో కరువైపోతున్న మానవత్వం


మనుషుల్లో రోజురోజుకు మానవత్వం కనుమరుగైపోతోంది. చెన్నైలో వెలుగుచూసిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. నీలగిరి అడవుల్లోంచి జనావాసాల్లోకి ఓ ఏనుగు ప్రవేశించింది. దానిని తిరిగి అడవుల్లోకి తరిమేందుకు స్థానికులు బాణసంచా, డప్పులు మోగించారు. అయితే కొందరు వ్యక్తులు ఓ టైరుకు నిప్పుపెట్టి ఏనుగును భయపెట్టే ప్రయత్నం చేశారు. అనంతరం ఆ టైరును ఏనుగు పైకి విసరడంతో ఆ టైరు కాస్తా ఏనుగు చెవికి చిక్కుకుంది. దాంతో ఆ ఏనుగు బాధను భరించలేక అడవిలోకి పరుగులు తీసింది.

ఆ మరుసటి రోజు తీవ్రగాయాలతో అడవిలో పడి ఉన్న ఏనుగును అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెంటనే చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేస్తుండగా ఏనుగు మరణించింది. చెవి భాగంలో బలమైన గాయం కావడంతోనే ఏనుగు చనిపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు టైరుకు నిప్పు పెట్టి ఏనుగు మీదకు విసిరే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దారుణాన్ని పలువురు నెటిజన్లు ఖండిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News