ఒడిషాలోని గంజాంలో దారుణం : ఆరుగురు మృతి.. 30 మందికి గాయాలు

Update: 2020-02-09 14:13 GMT

ఒడిషాలో విషాదం చోటు చేసుకుంది. వివాహా కార్యక్రమానికి హాజరయ్యేందుకు అతిధులు వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు అంటుకున్నాయి. తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను బరంపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చిక్ రోడాలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు అతిధులు వెళ్తున్న బస్సుకు 11 కేవి విద్యుత్ తీగలు తగిలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. గంజాం జిల్లాలోని గొలంత్ర పరిధిలోని మంద్ రాజ్ పూర్ మార్గంలో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే ఆరుగురు చనిపోగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలోచికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో మృత దేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటన జరిగిన తీరు హృదయ విదారకంగా మారింది. ఎంతో సంతోషంగా వివాహ వేడుకలో పాల్గొనేందుకు బయల్దేరిన వారు మృత్యువాత పడటడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాధాలు మిన్నంటాయి. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. బస్సులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ ఆసుపత్రికి తరలించి,పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని బరంపురలోని ఎంకేసీజీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు చెప్పారు.  

Tags:    

Similar News