జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

Update: 2020-06-01 13:06 GMT

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.నేడు కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా నేతృత్వంలో సమావేశమైన ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

జూన్ 19వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. గుజరాత్ 4, జార్ఖండ్ 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్ 3, మేఘాలయ 1, మణిపూర్ 1 మొత్తం 55 ఖాళీల్లో ఇప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 18 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 

Tags:    

Similar News