ఓటర్‌ ఐడితో ఆధార్‌ కార్డుని లింక్‌ చేస్తే ఏంటి ప్రయోజనం.. ఓటింగ్‌ సరళి ఏ విధంగా ఉంటుంది..

Voter ID With Aadhaar: ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021′ లోక్‌సభలో ఆమోదం పొందింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది.

Update: 2021-12-23 05:00 GMT

ఓటర్‌ ఐడితో ఆధార్‌ కార్డుని లింక్‌ చేస్తే ఏంటి ప్రయోజనం.. ఓటింగ్‌ సరళి ఏ విధంగా ఉంటుంది..

Voter ID With Aadhaar: ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021′ లోక్‌సభలో ఆమోదం పొందింది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఓటరు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇది తప్పనిసరి కాదు. నివల్ల ఇతరుల పేరుతో ఓట్లు వేసే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు నకిలీ ఓట్లు వేయలేరు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేసే మార్గం క్లియర్ అవుతుంది.

అయితే ఈ ప్రక్రియ ఐచ్ఛికం మాత్రమే. ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయాలా అని ఓటింగ్ అధికారి అడుగుతారు. ఆధార్‌ను లింక్ చేయాలా వద్దా అనేది ఓటరు కోరిక మేరకు ఉంటుంది. ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల ఈ-ఓటింగ్‌కు మార్గం సుగమం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సిమ్ కార్డు తీసుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా ఫింగర్ ప్రింట్ స్కానర్‌పై వేలి నొక్కినట్లే, ఆ తర్వాత ఓటింగ్ మెషీన్‌లో వేలిముద్ర వేసి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

ఈ-ఓటింగ్ ప్రతిపాదన

భారతదేశంలో ఈ-ఓటింగ్ లేదా ఆధార్ ఓటింగ్ కోసం చాలా ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఓటరు జాబితా లేదా ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఓటరు వెరిఫికేషన్ సులువుగా జరుగుతుంది. ఓటరు మెషీన్‌లో అమర్చిన ఫింగర్‌ప్రింట్ స్కానర్‌పై తన వేలిని ఉంచినప్పుడు అతని పేరు, చిరునామా, వయస్సు ఖచ్చితమైనవిగా గుర్తిస్తారు. ఓటు వేయడానికి సరైన పేరు, వయస్సు ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండు సౌకర్యాలు ఆధార్ ఆధారిత ఓటింగ్‌లో అందుబాటులో ఉంటాయి.

అయితే ఓటు వేసేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తే ఓటరు గుర్తింపు కార్డు అవసరం లేకుండా పోతుందని కొందరు వాదిస్తున్నారు. ఇప్పుడున్న విధానంలో ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు ఓటింగ్ స్లిప్‌తో పాటు ఆధార్‌ను చూపించాల్సి ఉంటుంది. పోలింగ్ అధికారి స్లిప్‌లోని పేరు, ఫోటోను ఆధార్ పేరు, ఫోటోతో సరిపోల్చుతారు. ఇదిలా ఉంటే మరో లాభం కూడా ఉంది. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఓటింగ్‌లో అవకతవకలను అరికట్టవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇది అమలైతే వలస ఓటర్లు తమ ఓటరు కార్డు ఉన్న చోటే ఓటు వేయగలుగుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన గ్రామంలోని ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉన్నాడు. చాలా కాలంగా అతడు నగరంలో నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి నగరంలోని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం రెండు చోట్లా ఓటరు జాబితాలో ఆ వ్యక్తి పేరు ఉంటుంది. అయితే దీన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తే ఒక చోట మాత్రమే పేరు కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి తన ఓటును ఒకే చోట మాత్రమే వేయగలడు.

Tags:    

Similar News