సీఎం ఆఫర్‌ను తిరస్కరించిన ఏక్‌నాథ్ షిండే

శివసేనను చీల్చే ప్రయత్నాల్లో ఏక్‌నాథ్‌షిండే

Update: 2022-06-23 01:21 GMT

సీఎం ఆఫర్‌ను తిరస్కరించిన ఏక్‌నాథ్ షిండే

Maharashtra Political Crisis: మహా సంక్షోభం నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. ఏక్‌నాథ్ షిండేకి సీఎం పదవి ఆఫర్ చేయాలని శరద్ పవార్ థాక్రేకు సూచించారు. మహారాష్ర్ట కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని చెప్పారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే వర్గం వైపు వెళ్లారు. అయితే ఏక్ నాథ్ షిండే మాత్రం ఈ ఆఫర్ ను తిరస్కరించారు. విరుద్ద సిద్దాంతాలు, భావజాలం కలిగిన ఎన్సీపీ కాంగ్రెస్ సంకీర్ణం నుంచి శివసేన బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. తన వద్ద 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసలైన శివసేనపార్టీ తనదేనని ఏక్ నాథ్ షిండే ప్రకటించుకున్నారు. 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు లేఖ పంపిన షిండే వర్గం భరత్ గోగ్వాలేను చీఫ్ విప్ గా నియమించుకుంది.

మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ర్ట అసెంబ్లీలో 106 మంది బీజేపీ, 55 మంది శివసేన, 44 మంది కాంగ్రెస్, ఎన్సీపీ 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్ర్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ సంకీర్ణ సర్కార్ కు 152 మంది సభ్యుల బలం ఉంది. ఫార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టం ప్రకారం చర్య తీసుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలల్లో 2/3 వంతు సభ్యులు ఉండాలి. అయితే షిండే క్యాంపులో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే వర్గంపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపబోదని తెలుస్తోంది. సీఎం ఉద్దవ్ ధాక్రే తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటించేలా ప్రయత్నాలు చేసే కన్నా అసెంబ్లీ రద్దుకే మొగ్గుచూపు అవకాశం ఉంది.

గుజరాత్ నుంచి గౌహతికి శిబిరాన్ని మార్చిన రెబల్స్ అక్కడి నుంచి మహా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పంపించారు. మొత్తం 34 మంది సంతకాలు ఉండటంతో తిరుగుబాటు శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇందులో భరత్ గోగ్వాలేను చీఫ్ విప్ గా నియమించామని షిండే తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో 56 స్థానాల్లో పాగా వేసిన అధికార శివసేనలో 22 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఏక్ నాథ్ షిండే ఏకంగా శివసేన పార్టీ తనదే అనే స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో అసలు శివసేన ఎవరిది..? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

Tags:    

Similar News