ED Summons: సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు..
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసు కాంగ్రెస్ అధినేతలను వెంటాడుతూనే ఉంది.
ED Summons: సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసు కాంగ్రెస్ అధినేతలను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోనియా, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. విచారణకు రేపే హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేయడం విశేషం.
అయితే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా పేర్కొంది. 1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారు, ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇందుకోసం ఈడీని ఉపయోగిస్తోంది. అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు.