ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

Update: 2020-10-19 10:16 GMT

జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణానికి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ స్థాపకుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఫారూక్ అబ్దుల్లా జె అండ్ కె క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు రూ .43 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం ఈ కేసుకు సంబంధించి శ్రీనగర్‌లో ప్రశ్నించడం జరుగుతోందని, ఇది బ్యాంకు పత్రాల ఆధారంగా ఉంటుందని వర్గాలు తెలిపాయి..

గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ప్రకటన ఆధారంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం తన తండ్రిపై కక్షగట్టిందని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News