ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రాజీనామా
*వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలిగిన నితీష్‌రాణా
ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రాజీనామా
ED Public Prosecutor: వ్యక్తిగత కారణాలతో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి నితేష్ రాణా రాజీనామా చేశారు. ఎన్నో కీలక కేసులకు సంబంధించి ఈడీ తరపున వాదించారు. విజయ్ మాల్యాపై మనీలాండరింగ్ కేసుల వంటి హైప్రొఫైల్ విషయాల్లో నితీష్ రాణా ఈడీకి ప్రాతినిధ్యం వహించారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాణా అనేక ఉన్నత స్థాయి కేసుల్లో ఫెడరల్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు. లష్కరే ఎ తోయిబాకి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు వంటి విషయాల్లో ఈడీ తరపున వాదించారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించిన విచారణలో యుకెలోని కోర్టులో ఈడీకి ప్రాతినిధ్యం వహించాడు నితీష్ రాణా.
తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని, కేవలం వ్యక్తిగత కారణాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి న్యాయవాది నితీష్ రాణా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం, టీఎంసీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్‌లతో సహా అనేక ఉన్నతమైన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు.