Earthquake in Nepal: నేపాల్ లో భూకంపం

Earthquake in Nepal: నేపాల్‌లో బుధవారం ఉదయం 5.42 గంటలకు భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది

Update: 2021-05-19 04:10 GMT

Earthquake in Nepal:(File Image)  

Nepal Earthquake: నేపాల్‌లో బుధవారం ఉదయం 5.42 గంటలకు భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. అది రాజధాని ఖాట్మండుకు వాయవ్య దిశలో 113 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. ఖాట్మండు తూర్పు ఈశాన్య దిశలో 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు పేర్కొంది. ఉదయం 5 గంటల 4 నిమిషాల ప్రాంతంలో భూఉపరితలాన 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వెల్లడించింది.

భూప్రకంపన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఖాట్మండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అని నేషనల్ ఎర్త్ క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని సిస్మోలజిస్ట్ డాక్టర్ లోక్‌బిజయ్ అధికారి తెలిపారు. ఈ భూకంపం పెద్దదేమీ కాదు కాబట్టి... ఎవరూ చనిపోలేదు. ఆస్తినష్టం ఏదైనా జరిగిందే ఆనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు నేపాల్‌లో భూకంపం వచ్చిందంటే దాని అర్థం... హిమాలయ పర్వతాల కింద ఉన్న భూ పలకాలు కదిలాయన్న మాట. అవి మరింతగా కదిలితే... ఢిల్లీ సహా... ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది.

మన దేశానికి ఉత్తరాన ఉండే నేపాల్‌లో భూకంపం రావడం అనేది మన ఇండియాకి ప్రమాదకర సంకేతం. ఎందుకంటే... కోట్ల సంవత్సరాల కిందట అంటార్కిటికా నుంచి విడిపోయిన ఇండియా... హిందూ మహా సముద్రంలో తేలుతూ... ఆసియా ఖండానికి అతుక్కుపోయింది. అలా అతుక్కునేటప్పుడు... బలంగా ఢీ కొట్టింది. అప్పుడు ఢీ కొట్టిన ప్రాంతంలో... ఆసియా భూమి, ఇండియా భూమి... రెండూ అతుక్కుపోతూ పైకి లేచాయి. అవే హిమాలయ పర్వతాలు అయ్యాయి. ఇప్పటికీ ఆ రాపిడి జరుగుతూనే ఉంది. ఇండియా ఇప్పుడు సంవత్సరానికి 2 సెంటీమీటర్లు ఈశాన్యం వైపుకి జరుగుతోంది. ఇలా కదులుతున్నప్పుడు ఈ భూకంపాలు వస్తున్నాయి.

Tags:    

Similar News