Earthquake: శ్రీలంకలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

Earthquake: భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు

Update: 2023-11-15 01:40 GMT

Earthquake: శ్రీలంకలో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

Earthquake: శ్రీలంక రాజధాని కొలంబోను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులంతా భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. భూ ప్రకంపనల తీవ్రతకు కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కి.మీ దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తాజా భూకంపంవల్ల శ్రీలంకకు పెద్దగా నష్టం లేదని అమెరికా జియోలాజికల్‌ సర్వే అండ్‌ మైన్స్‌ బ్యూరో పేర్కొంది. మరోవైపు భారత్‌లోని లద్దాఖ్‌లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత 4.4గా నమోదైంది.

Tags:    

Similar News