Iran: ఇరాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. ఏడుగురు మృతి, 440 మందికి గాయాలు
Iran: టర్కీ,ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం
Iran: ఇరాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. ఏడుగురు మృతి, 440 మందికి గాయాలు
Iran: ఇరాన్‌లో భూకంపం సంభవించింది. ఏడుగురు మరణించారు. 440 మంది గాయపడ్డారు. వెస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో టర్కీ, ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఈ భూకంపం సంభవించింది. ఇరానియన్ సెస్మలాజికల్ సెంటర్ ప్రకారం, శనివారం రాత్రి 9.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.9 తీవ్రతతో భూ కంపం వచ్చింది. 7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఇరాన్ నార్త్ వెస్ట్‌లోని ఖోయ్ నగరంలో ఈ భూకంపం ప్రధానంగా ప్రభావం చూపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.