Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Japan: వెస్ట్‌ జపాన్‌ తీరంలో భూకంప కేంద్రం

Update: 2024-01-01 08:33 GMT

Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Japan: కొత్త సంవత్సరం వేళ.. జపాన్‌‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదైందని వెల్లడించింది. దీంతో జపాన్‌ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని ఒక మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు తెలుస్తోంది. ఇక భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా..? అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్‌ పవర్‌ సంస్థ వెల్లడించింది.

Tags:    

Similar News