Maha Kumbh Mela Stampede: తొక్కిసలాటపై యోగి.. భక్తులు పుకార్లు నమ్మొద్దు

Maha Kumbh Mela Stampede: ప్రయోగరాజ్ లో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయనని.. భక్తులు పుకార్లు నమ్మొద్దని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు.

Update: 2025-01-29 05:48 GMT

Maha Kumbh Mela Stampede: ప్రయోగరాజ్ లో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయనని.. భక్తులు పుకార్లు నమ్మొద్దని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు. కుంభమేళలో భక్తుల రద్దీ అధికంగా ఉందని., మౌని అమావాస్య పురస్కరించుకని భక్తులు పోటెత్తారని చెప్పారు. ఉదయం 8 గంటల వరకు మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. రద్దీ తక్కువగా ఉన్న ఘాట్ ల దగ్గర పుణ్ స్నానాలు ఆచరించాలని కోరారు.

తొక్కిసలాటలో గాయపడిన 40 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారని చెప్పారు. యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం యోగి చెప్పారు.

Tags:    

Similar News