Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. రాత్రిపూట ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా..!

Indian Railway: ఇండియన్ రైల్వేలలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రైల్వేలు భారతదేశానికి అతిపెద్ద రవాణా వ్యవస్థ.

Update: 2022-04-04 15:30 GMT

Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. రాత్రిపూట ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా..!

Indian Railway: ఇండియన్ రైల్వేలలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రైల్వేలు భారతదేశానికి అతిపెద్ద రవాణా వ్యవస్థ. మనమందరం జీవితంలో ఒక్కసారైనా రైలులో ప్రయాణించి ఉంటాం. అయితే రైల్వేలో ప్రయాణం చేసేటప్పుడు చాలా సార్లు ప్రజలకు రైల్వే నిబంధనల గురించి తెలియదు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు నిబంధనలను రూపొందించింది. వీటి ఉద్దేశం ఏంటంటే తోటి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఈ నిబంధనలని అమలు చేస్తుంది.

రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు చాలా మంది బిగ్గరగా మాట్లాడతారు. కొందరు బిగ్గరగా పాటలు వింటారు. దీనివల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారిపై రైల్వే కఠినంగా వ్యవహరిస్తుంది. ఇతరులకు ఇబ్బంది కలిగించినందుకు మీకు జరిమానా, జైలు శిక్ష రెండు విధించవచ్చు. కాబట్టి రాత్రి సమయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. వాటి గురించి తెలుసుకుందాం.

రాత్రిపూట బిగ్గరగా పాడడం

చాలా మందికి బిగ్గరగా పాడటం అలవాటు. రాత్రిపూట రైలులో పెద్ద గొంతుతో పాటలు పాడితే తోటి ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో వారు ఫిర్యాదు చేస్తే రాత్రి తోటి ప్రయాణీకుల నిద్రకు భంగం కలిగించినందుకు రైల్వే మీకు జరిమానా విధిస్తుంది.

రాత్రిపూట లైట్లు వేయవద్దు

రైల్వే నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కోచ్‌లో లైట్లు వేయడం నిషేధం. లైట్లు వెలిగించడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరైనా లైట్లు ఆన్ చేయడం గురించి ఫిర్యాదు చేస్తే వారు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడటం

రాత్రిపూట రైలులో మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడటం నిషేధం. ఎందుకంటే అందరు నిద్రపోతారు. ఈ పరిస్థితిలో పెద్ద గొంతుతో మాట్లాడటం మిగిలిన ప్రయాణీకుల నిద్రను భంగపరుస్తుంది. బిగ్గరగా మాట్లాడటం వల్ల రైల్వే శాఖ మీపై చర్యలు తీసుకోవచ్చు.. ప్రయాణీకుల మాట విననందుకు జరిమానా విధిస్తుంది. దీంతో పాటు అతను సెక్షన్ 145 కింద నేర అర్హుడు అవుతాడు.

Tags:    

Similar News