విమానంలో ప్రయాణించేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే మళ్లీ ఎక్కలేరు..!

No Fly List: మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు ఎయిర్‌లైన్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే అంతే సంగతులు.

Update: 2023-02-08 16:00 GMT

విమానంలో ప్రయాణించేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే మళ్లీ ఎక్కలేరు..!

No Fly List: మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు ఎయిర్‌లైన్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే అంతే సంగతులు. పెద్ద ఇబ్బందుల్లో పడుతారు. ఎందుకంటే ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఇండిగోతో సహా అనేక భారతీయ విమానయాన సంస్థలు గత కొన్ని రోజులుగా ముఖ్యాంశాలలో ఉన్నాయి. విమాన ప్రయాణ సమయంలో చాలా మంది ఎయిర్‌లైన్స్ నిబంధనలను ఉల్లంఘించిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది మాస్క్‌లు ధరించరు. మరికొందరు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కారణంగానే గత ఏడాది కాలంలో 63 మంది ప్రయాణికులను నో ఫ్లై లిస్ట్‌లో ఉంచారు.

విమానయాన సంస్థ అంతర్గత కమిటీ సిఫారసు మేరకు 2023లో కేవలం ముగ్గురు ప్రయాణికులను మాత్రమే నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చామని గత ఏడాది 63 మంది ప్రయాణికులను చేర్చామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్ తెలిపారు. వీటిలో గత సంవత్సరంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దృష్టికి వచ్చిన రెండు మూత్రవిసర్జన సంఘటనలు ఉన్నాయి.

నో ఫ్లై లిస్ట్ అంటే ఏమిటి..?

ఎయిర్‌లైన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులని నో ఫ్లై లిస్ట్‌లో పెడుతారు. అంటే వీరు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధిస్తారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించలేరు. విమానాలలో పెరుగుతున్న దుర్వినియోగ సంఘటనలకు ప్రతిస్పందించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2017 సంవత్సరంలో నో ఫ్లై జాబితాను ప్రవేశపెట్టింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2017 నుంచి మొత్తం 143 మందిని నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచారు.

Tags:    

Similar News