South States Result Update: తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్ అధిక్యం

South States Result Update: తమిళనాడులో డీఎంకే, కేళలలో ఎల్డీఎఫ్ ముందంజలో కొనసాగుతున్నాయి.

Update: 2021-05-02 06:11 GMT

కేరళలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు


South States Results Updates: ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా… పశ్చిమ బెంగాల్‌లో 1,113 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే… కేరళలో 633, అసోంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటుచేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

కేరళలో ఈ సారి వామపక్ష కూటమి (ఎల్ డీఎఫ్)దే గెలుపు అని అన్ని సర్వేలు తెల్చేశాయి. అయినప్పటికీ విపక్షం అయిన యూడీఎఫ్ కూటమి మాత్రం ఆశలు విడిచి పెట్టలేదు. కేరళలోని పాలక్కడ్‌లో బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ తన సమీప ప్రత్యర్థిపై 1425 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ధర్మదామ్ నుంచి పోటీలో ఉన్న ముఖ్యమంత్రి విజయన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ నుంచి బరిలోకి దిగిన మక్కల్ నీది మయ్యం చీఫ్, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తన ప్రత్యర్థిపై 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇటు తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకేనే అధికారం చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అధిక్యంలో కొనసాగుతుండగా, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శివపూర్ నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన క్రికెటర్ మనోజ్ తివారీ వెనుకంజలో ఉన్నారు.

Tags:    

Similar News