యునెస్కో హెరిటేజ్‌ జాబితాలో దీపావళి పండుగ

భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగకు అరుదైన ప్రపంచ గౌరవం దక్కింది.

Update: 2025-12-10 09:02 GMT

భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగకు అరుదైన ప్రపంచ గౌరవం దక్కింది. యునెస్కో (UNESCO) ఈ పండుగను తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ (Intangible Cultural Heritage) జాబితాలో చేర్చింది. వేల ఏళ్లుగా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన సంస్కృతికి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో నిర్వహించిన యునెస్కో అంతర్ ప్రభుత్వ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశంలో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో ఈ కమిటీ సమావేశం జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

దీపావళిని యునెస్కో జాబితాలో చేర్చడం ద్వారా, ఈ పండుగ యొక్క సాంస్కృతిక, సామాజిక మరియు చారిత్రక ప్రాధాన్యత ప్రపంచ వేదికపై మరింత సుస్థిరమైంది.

Tags:    

Similar News