ఎంపీ సంక్షోభం: దిగ్విజయ్‌, శివకుమార్‌ అరెస్ట్!

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

Update: 2020-03-18 05:33 GMT
Digvijaya Singh

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రమాడ హోటల్‌లో ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు బుధవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ బెంగళూరు వెళ్లారు. ఆయనకు కర్ణాటక కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివ కుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం నేరుగా వారిరువురు కలిసి ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్‌ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి అనుమతి లేదంటూ వారిని బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్‌ హోటల్‌ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌, శివకుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దిగ్విజయ్‌, శివకుమార్‌ తోపాటు మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలను అదుపులోనికి తీసుకొని అమృతహల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

దీనిపై స్పందించిన దిగ్విజయ్ "నేను మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ అభ్యర్థిని, మార్చి 26 న ఓటింగ్ జరగనుంది.. అందులో భాగంగా "నా ఎమ్మెల్యేలను ఇక్కడ ఉంచారు, వారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు, వారి ఫోన్లు లాక్కొనిపోయారు, ఎమ్మెల్యేలకు భద్రతా ముప్పు ఉందని పోలీసులు వారితో మాట్లాడటానికి నన్ను అనుమతించడం లేదు." అంటూ చెప్పారు.

అలాగే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది అని డీకే శివకుమార్ అన్నారు. 'మాకు మా స్వంత రాజకీయ వ్యూహం ఉంది, పరిస్థితిని ఎలా నిర్వహించాలో మాకు తెలుసు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిని సృష్టించడం నాకు ఇష్టం లేదు.' అని అన్నారాయన.

ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్.. అసెంబ్లీ స్పీకర్ ఎన్.పి.ప్రజాపతికి బుధవారం ఒక లేఖ పంపారు, కమల్ నాథ్ నేతృత్వంలోని ఆరుగురు మంత్రుల రాజీనామాలను అంగీకరించడం ద్వారా తాను "నిష్పాక్షికమైన మరియు సాహసోపేతమైన" నిర్ణయం తీసుకున్నానని అందులో పేర్కొన్నారు.

కాగా తన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలకు ప్రవేశం కల్పించాలని కేంద్రానికి, కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు అదే రోజు, అసెంబ్లీలో తక్షణ బలపరీక్షను కోరుతూ భారతీయ జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మరియు అతని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేపట్టింది. 


Full View


Tags:    

Similar News