Maha Kumbh Mela 2025: భక్త జనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు

Maha Kumbh Mela 2025: సాధు పుంగవుల శంఖానాదాలు... ఎముకలు కొరికే చలి... గడ్డగట్టే స్థితిలో నదీజలాలు... ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ నదీ సంగమ ప్రాంతం భక్త జనసంద్రమైంది.

Update: 2025-01-14 07:04 GMT

MahaKumbh Mela 2025: మార్చి వరకు మహాకుంభమేళా పొడిగింపు? ప్రయాగ్ రాజ్ కలెక్టర్ ఏమన్నారంటే?

Maha Kumbh Mela 2025: సాధు పుంగవుల శంఖానాదాలు... ఎముకలు కొరికే చలి... గడ్డగట్టే స్థితిలో నదీజలాలు... ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ నదీ సంగమ ప్రాంతం భక్త జనసంద్రమైంది. గంగామాతకు హారతిచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళా ఆరంభమైన తొలిరోజే కోటిన్నరమందికిపై గా భక్తులు తరలివచ్చారు. దేశనలుచెరగునుంచే గాకుండా, విదేశానుంచి భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు.

చారిత్రక సంబరంలో స్వయంగా భాగస్వామ్యమయ్యేందుకు కొందరు, కళ్లారా తిలకించేందుకు మరికొందరు ఇలా వేలాదిగా తరివచ్చారు. ఎక్కడచూసినా జనమే జనం. గంగ, యమునా నదులతో పాటు, అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీనదీ సంగమాన్ని పవిత్ర స్థలంగా భావించి పుణ్యస్నానాలు ఆచరించారు.

మహాకుంభమేళా సందర్భంగా తక్కవ ఖర్చుతో హెలికాప్టర్ ప్రయాణసౌకర్యాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 1296 రూపాయల ఖర్చుతో ప్రయాగ్‌రాజ్, మహాకుంభమేళా స్థావరాన్ని ఆకాశంపైనుంచి చూసి తరించే వెసులుబాటు కల్పించారు.

Tags:    

Similar News