Aadhar Update: ఇప్పుడు ఆ వివరాలు కూడా ఆధార్‌ కార్డులోనే..!

Aadhar Update: ఇప్పుడు ఆ వివరాలు కూడా ఆధార్‌ కార్డులోనే..!

Update: 2022-07-08 06:30 GMT

Aadhar Update: ఇప్పుడు ఆ వివరాలు కూడా ఆధార్‌ కార్డులోనే..!

AadharUpdate: ఆధార్‌ లేనిదే ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాలకి ఆధార్‌ చాలా ముఖ్యం. దాదాపు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్ భారతదేశంలోని వ్యక్తులందరికీ ప్రత్యేకమైన గుర్తింపు రుజువు. దీనిని UIDAI జారీ చేస్తుంది. ఇందులో వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. యూఐడీఏఐ ప్రతి ఒక్కరికి 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ని జారీ చేస్తుంది. అయితే ఆధార్‌కు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు UIDAI ఇప్పుడు కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తోంది.

అదేంటంటే జనన మరణ డేటాను ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు నవజాత శిశువుకు తాత్కాలిక ఆధార్ నంబర్ జారీ చేస్తారు. తరువాత అది బయోమెట్రిక్ డేటాతో అప్‌గ్రేడ్ అవుతుంది. అంతే కాదు మరణాల నమోదు రికార్డును ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఆధార్ నంబర్‌ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఇప్పుడు ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు పూర్తి వివరాలు ఆధార్‌ డేటా ద్వారా తెలుసుకోవచ్చు.

యూఐడీఏఐ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం.. 'పుట్టుకతో ఆధార్ నంబర్‌ను జారీ చేయడం వల్ల కుటుంబం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల సామాజిక భద్రత ప్రయోజనాలు ఎవరూ కోల్పోకుండా ఉంటారు. అదేవిధంగా డెత్ డేటాతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పథకం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. లబ్దిదారుడు మరణించిన తర్వాత అతని ఆధార్‌ను వాడుతున్న అనేక కేసులు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు వినియోగదారుల ప్రయోజనం కోసం ఆధార్‌ కార్డులని అప్‌డేట్‌ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జీరో ఆధార్‌ను జారీచేయాలని యోచిస్తోంది. దీంతో నకిలీ ఆధార్ నంబర్ జనరేట్ కాదు.. అంటే ఎలాంటి ఫోర్జరీ ఉండదు. దీని ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు ఉండవు. పుట్టిన, నివాస లేదా ఆదాయ రుజువు లేని వ్యక్తులకు జీరో ఆధార్ నంబర్ కేటాయిస్తారు.

Tags:    

Similar News