Dense Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 100 విమానాలు ఆలస్యం.. 18 రైళ్లు ఆలస్యం

Dense Fog: విమానాల ఆలస్యంతో ప్రయాణికుల ఇబ్బందులు

Update: 2024-01-15 09:23 GMT

Dense Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 100 విమానాలు ఆలస్యం.. 18 రైళ్లు ఆలస్యం

Dense Fog: ఉత్తర భారతావనిని పొగ మంచు కమ్మేసింది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్‌ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా టైమింగ్స్‌లో మార్పులు చేశారు.

ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. ఇవాళ వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయింది. మరోవైపు వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News