Mette Frederiksen: తాజ్‌మహల్‌ను సందర్శించిన డెన్మార్క్ ప్రధాని
*ప్రేమ సౌధంపై ప్రశంసలు కురిపించిన డానిష్ ప్రధాని *గంటన్నరకు పైగా తాజ్ దగ్గర గడిపిన మెట్టే ఫ్రెడెరిక్సెన్
భర్తతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన మెట్టే ఫ్రెడెరిక్సెన్(ఫైల్ ఫోటో)
Mette Frederiksen: తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఇవాళ ఉదయం తన భర్తతో కలిసి తాజ్‌ను సందర్శించిన సందర్భంగా ప్రేమ సౌధంపై ప్రశంసలు కురిపించారు. దాదాపు గంటన్నరకు పైగా తాజ్‌మహల్ అందాలను వీక్షించిన డానిష్ పీఎం తాజ్‌మహల్ ప్రపంచంలోనే అద్భుతమని వ్యాఖ్యానించారు. డెన్మార్క్ ప్రధాని తాజ్‌ను సందర్శన సమయంలో తాజ్‌మహల్, ఆగ్రా కోటను రెండు గంటల పాటు మూసివేసినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.