Rahul Gandhi: పార్లమెంట్ నడిపే పద్ధతి మాత్రం ఇది కాదు
Rahul Gandhi: పార్లమెంట్‌లో గందరగోళం మధ్య బిల్లు వెంట బిల్లు ఆమోదించుకుంటూ పోతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
Rahul Gandhi: పార్లమెంట్ నడిపే పద్ధతి మాత్రం ఇది కాదు
Rahul Gandhi: పార్లమెంట్‌లో గందరగోళం మధ్య బిల్లు వెంట బిల్లు ఆమోదించుకుంటూ పోతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న రాహుల్ పార్లమెంట్‌ను నడిపే పద్ధతి ఇది కాదంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీ సభకు రారని, జాతీయ ప్రాధాన్యం కలిగిన ఏ అంశాన్ని ప్రస్తావించేందుకు విపక్షాలను అనుమతించరని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనీ చేయడం దురదృష్టకరం అని రాహుల్ వ్యాఖ్యానించారు.