Delhi: రాజ్‌పథ్ పేరు మార్పునకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం

Delhi: కర్తవ్యపథ్‌గా పేరు మారుస్తూ చేసిన ప్రతిపాదనకు అంగీకారం

Update: 2022-09-07 12:15 GMT

Delhi: రాజ్‌పథ్ పేరు మార్పునకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం

Delhi: ఏటా గణతంత్ర దినోత్సవాల్లో దేశ ఆయుద సంపత్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే రా‌జ్‌పథ్‌కు పేరు మారింది. ఈ మేరకు రాజ్‌పథ్ పేరు కర్తవ్య‌పథ్‌గా మార్చాలనే ప్రతిపాదనలకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేంద్ర సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షీ లేఖి అధ్యక్షతన జరిగిన ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్నిఇక నుంచి కర్తవ్యపథ్‌గా పిలుస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగానే రాజ్‌పథ్ పేరును మార్చినట్టు కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి తెలిపారు.

వలసవాద విధానాలు, చిహ్నాలు మార్చాలన్నవిధానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే అని పిలవగా, స్వాతంత్ర్యం అనంతరం రాజ్‌పథ్‌గా పేరు మార్చారు. ఇకనుంచి కర్తవ్యపథ్‌గా పిలుస్తారు. ప్రధాని మోడీ కర్తవ్యపథ్‌ను ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం 20 నెలలపాటు ఆ ప్రాంతంలో సందర్శకులను అనుమతించలేదు. అయితే ఎల్లుండి నుంచి కర్తవ్యపథ్‌కు ప్రజలను అనుమతిస్తారు. కర్తవ్యపథ్‌లో అన్ని రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. 

Tags:    

Similar News