ఢిల్లీలో మోగనున్న బడిగంట

Delhi: రాజధానిలో బడి గంట మోగనున్నది ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను సడలించింది.

Update: 2022-02-04 12:56 GMT

ఢిల్లీలో మోగనున్న బడిగంట

Delhi: రాజధానిలో బడి గంట మోగనున్నది ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. సోమవారం నుంచి విద్యాస్థంస్థలు తెరుచుకుంటాయని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు క్రమంగా అదుపులోకి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

థర్డ్‌వేవ్‌తో వణికించిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు 2వేలకు పడిపోయాయి. దీంతో కరోనా ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం మరింత సడలించింది. పాఠశాలలను దశల వారీగా తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. కార్యాలయాలను 100 శాతం సామర్థ్యంతో తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. జిమ్‌లను పరిమిత ఆంక్షలతో తెరుచుకోవచ్చని తెలిపింది.

7వ తేదీ నుంచి 9 నుంచి 12వ తరగతి క్లాసులను ప్రారంభించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నర్సరీ నుంచి 8వ తరగతి క్లాసులను 14 నుంచి తెరుచుకునేలా ఆదేశాలను జారీ చేసింది. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న ఉపాధ్యాయులను మాత్రమే స్కూళ్లకు అనుమతించింది. విద్యాసంస్థల్లో తప్పనిసరి కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. నైట్‌ కర్ఫ్యూను గంట సమయం తగ్గించింది. రాత్రి 11 గంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలవుతుంది.

Tags:    

Similar News