Delhi Ordinance Bill: ఇవాళ పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వ్యతిరేకిస్తున్న విపక్ష కూటమి ఇండియా

Delhi Ordinance Bill: వ్యతిరేకంగా ఓటు వేయాలని ఇండియా కూటమి రాజ్యసభ ఎంపీలకు విప్‌

Update: 2023-08-01 05:22 GMT

Delhi Ordinance Bill: ఇవాళ పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వ్యతిరేకిస్తున్న విపక్ష కూటమి ఇండియా

Delhi Ordinance Bill: ఢిల్లీ సర్కారు విధులకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 2023 అని పిలిచే ఈ బిల్లును.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఢిల్లీలో పాలనాధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తోంది విపక్ష ఇండియా కూటమి. తమ కూటమిలోని రాజ్యసభ ఎంపీలకు విప్‌ జారీ చేసింది. ఓటింగ్‌లో పాల్గొని.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించాయి ఆయా పార్టీలు. అటు బీఆర్ఎస్ కూడా తమ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసింది. రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News