హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఆక్సిజన్‌ వాహనాలను అడ్డుకుంటే ఉరితీస్తాం..

ఢిల్లీని కరోనా తన గుప్పిట్లో బంధించింది. రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి.

Update: 2021-04-24 10:26 GMT

హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఆక్సిజన్‌ వాహనాలను అడ్డుకుంటే ఉరితీస్తాం..

ఢిల్లీని కరోనా తన గుప్పిట్లో బంధించింది. రికార్డు స్థాయిలో కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరైనా ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలను తప్పవని హెచ్చరించింది. ఆక్సిజన్‌ సరఫరాకు ఆటంకం కలిగిస్తే ఉరితీస్తామంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత ఉండగా, ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో చేరిన వారికి ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలు ఆస్పత్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా మరో ఆసుపత్రి కూడా కోర్టు మెట్లక్కింది. ఇది సెకండ్‌ వేవ్‌ కాదని, సునామీ అంటూ వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరాకు అడ్డుపడే వారి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రస్తుతం ఢిల్లీలో 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుందని విచారణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. కొరత కారణంగా గత 24 గంటల్లో దారుణమైన ఘటనలు కళ్ల ముందు కనిపించాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. నిన్న కేవలం 297 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేంద్రం నుంచి లభించిందని తెలిపింది. 

Tags:    

Similar News