ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ ల నిషేధం: మనీష్ సిసోడియా
కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టడానికి మరికొన్ని నివారణ చర్యలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టడానికి మరికొన్ని నివారణ చర్యలను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.. దేశ రాజధానిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను నిషేధించింది. "ఐపిఎల్ వంటి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే క్రీడా కార్యకలాపాలను నిషేధించాలని మేము నిర్ణయించుకున్నాము.
కరోనావైరస్ వ్యాప్తి అరికట్టడానికి సామాజిక దూరం ముఖ్యం," అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఢిల్లీలో సెమినార్లు, సమావేశాలు లేదా పెద్ద కార్యక్రమాలు (200 మందికి మించి) అనుమతించబడదని సిసోడియా చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని సినిమా హాళ్ళను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.