50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం

* ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగుల పని వేళల్లో మార్పులు చేయాలి * ప్రభుత్వ కార్యాలయాల్లోని గ్రేడ్ వన్, తత్సమాన స్థాయి అధికారులందరూ... * నూటికి నూరు శాతం కార్యాలయాలకు హాజరుకావాలి

Update: 2020-11-29 05:35 GMT

కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తోంది. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పని చేసే అవకాశం కల్పించింది. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగుల పని వేళల్లో మార్పులు చేయాలని సలహా ఇచ్చింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ విజయ్ దేవ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని గ్రేడ్ వన్, తత్సమాన స్థాయి అధికారులందరూ నూటికి నూరు శాతం కార్యాలయాలకు హాజరుకావాలని తెలిపారు. మిగిలిన సిబ్బందిలో 50 శాతం మంది అవసరాన్నిబట్టి కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు డిసెంబరు 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటాయన్నారు.

Tags:    

Similar News