Delhi: ఆటో వాలాకు ఢిల్లీ వాలా రిలీఫ్

Delhi: ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్ధిక సాయం చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2021-05-04 13:27 GMT

అరవింద్ కేజ్రీవాల్  (ఫైల్ ఫోటో)

Delhi: ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. అయినా ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. ఆక్సిజన్ కొరతతో పరిస్ధితి దారుణంగా తయారైంది. అయినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ప్రతి క్షణం రివ్యూ చేస్తూ.. ప్రతి రోజూ ప్రజలకు అప్పీల్ చేస్తూ.. కరోనాపై యుద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ వలన వచ్చే ఇబ్బందులు ఇప్పటికే గమనించినందున.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్ధిక సాయం చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

అంతే కాదు.. రెండు నెలల పాటు ప్రతి కార్డ్ హోల్డర్ కి రేషన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. ఉపాధి కోల్పోయిన డ్రైవర్లకు ఆర్ధిక భరోసాను అందించేందుకు ఢిల్లీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోవాలలు, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. డిల్లీలో రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడబడుతుందని తెలియజేశారు.

Tags:    

Similar News