Delhi: మరికొన్ని రోజులు ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్

*మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేదాకా విద్యాసంస్థల మూసివేత *నిర్మాణాలు, కూల్చివేతలపై ఈనెల 21దాకా నిషేధం

Update: 2021-11-18 04:15 GMT

 సుప్రీంకోర్టు(ఫైల్ ఫోటో)

Delhi: ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటీకి పెరిగిపోతుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలకమైన చర్యలు చేపట్టబోతున్నట్లు బుధవారం సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూసివేతను కొనసాగిస్తున్నామని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని చెప్పింది. నగరంలోకి నిత్యావసర సరుకు రవాణాల వాహనాలు తప్ప ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది.

నిర్మాణాలు, కూల్చివేతల కార్యకలాపాలను ఈనెల 21 దాకా నిషేధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఎయిర్ క్వాలిటీ కమిషన్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్రం, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

అటు పొలాల్లో మిగిలిన గడ్డిని కాల్చకూడదని రైతులను కోరతామని హర్యానా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రైతులకు అవగాహన కల్పిస్తామని, రెండు వారాలు రైతులు గడ్డి కాల్చకుండా చర్యలు చేపడతామని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News