Manish Sisodia: ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక అమిత్‌షా ఉండటం సిగ్గుచేటు
Manish Sisodia: గతంలో 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్లాన్
Manish Sisodia: ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక అమిత్‌షా ఉండటం సిగ్గుచేటు
Manish Sisodia: తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మొయినాబాద్ ఎపిసోడ్‌పై స్పందించిన ఆయన.. బీజేపీ నేతలకు చురకలు అంటించారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు. తమ పార్టీలో చేరితే ఈడీ, సీబీఐ దాడులు ఉండవంటున్నారని ఏకంగా ఆడియోలు బయటకు రావడం ఆపార్టీ కుట్రలకు నిదర్శనం అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కేంద్రమంత్రి అమిత్ షా ఉండటం సిగ్గుచేటని మనీష్ సిసోడియా దుయ్యబట్టారు. గతంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో 43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన ప్లాన్‌లో వీరి హస్తం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్న సిసోడియా.. బీజేపీ నేతలకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు.