Arvind Kejriwal on Delhi Coronavirus Updates: శుభవార్త.. ఢిల్లీ ఊపిరి పీల్చుకుంటోంది..

Update: 2020-07-27 09:00 GMT

Arvind Kejriwal on Delhi Coronavirus Updates: దేశ రాజధానిలో కోవిడ్ -19 పరిస్థితి మెరుగుపడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. కేజ్రీవాల్ ఢిల్లీలో రికవరీ రేటు 88 శాతంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తొమ్మిది శాతం మంది మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, నమోదైన మొత్తం కేసులలో రెండు-మూడు శాతం మంది మాత్రమే మరణించారని కేజ్రీవాల్ తెలిపారు. మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టం చేశారు. 'ఢిల్లీ మోడల్' గురించి భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చర్చ జరుగుతుందని సిఎం అన్నారు. జూన్ లో కోవిడ్ మరణాలు 44 శాతం తగ్గాయని.. మరణాల రేటు జీరో కి వచ్చినప్పుడే ఉపశమనం అని అన్నారు.

కాగా జూలై 16న ఢిల్లీలోని పార్లమెంటు సభ్యులందరితో సిఎం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు ఉండటంతోనే కరోనావైరస్ తో పోరాడే 'ఢిల్లీ మోడల్' సాధ్యమైందని సమావేశంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే ఢిల్లీలో మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత జూన్‌ 23న ఒకే రోజు అత్యధికంగా 3,947 కేసులు వచ్చాయి. అయితే ఇది సరిగ్గా నెలరోజులకు 1,349గా నమోదయింది. నెల రోజుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేసుల్ని నియంత్రించాయి. జూన్‌లో 36% ఉన్న రికవరీ రేటు, జూలై 25 నాటికి 88%కి పెరిగింది.  

Tags:    

Similar News