Arvind Kejriwal: గుజరాత్‌లో స్కూళ్లు దారుణమన్న కేజ్రీవాల్‌

Arvind Kejriwal: తమకు అవకాశమిస్తే.. స్కూళ్లను మారుస్తామని హామీ

Update: 2022-05-01 14:00 GMT

Arvind Kejriwal: గుజరాత్‌లో స్కూళ్లు దారుణమన్న కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఆసియాలోకెల్ల అత్యంత ధనవంతులు గుజరాత్‌లో ఉన్నా పేదలకు మాత్రం విద్య అందని ద్రాక్షగా మారిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 6వేల స్కూళ్లు మూతపడినట్టు తెలిపారు. మరికొన్ని శిథిలావస్థలో మగ్గుతున్నాయన్నారు. లక్షలాది మంది భవిషత్తు గందరగోళంగా మారిందని కేజ్రీవాల్‌ వాపోయారు. పరీక్ష పేపర్ల లీకేజీలో గుజరాత్‌ ప్రపంచ రికార్డు సాధిస్తుందని ఎద్దేవా చేశారు. సీఎం భూపేంద్ర పటేల్‌కు దమ్ముంటే పరీక్ష పేపర్లు లీక్‌ కాకుండా పరీక్షలు నిర్వహించాలని సవాల్ విసిరారు. తమకు ఒక్క చాన్స్‌ ఇస్తే స్కళ్లను పూర్తిగా మార్చి చూపిస్తామని ఢిల్లీ స్కూళ్లలను తలపించేలా చేస్తామన్నారు. ఒకవేళ తాను అలా మార్చకపోతే తనను తరిమికొట్టాలని ప్రజలకు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

ఢిల్లీలో 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలోని రిక్షావాలా కుమారుడు, ధనికుడు కలిసే చదువుకుంటున్నారన్నారు. ఢిల్లీలోని సర్కారు బడుల్లో 99.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. గుజరాత్‌లోని కోటి అదివాసులు ఉన్నారని ఈ రాష్ట్రం నుంచే ఇద్దరు ధనవంతులు ఉన్నా వారి పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ హయాంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారాని ఆరోపించారు. తాము నిరుపేదలైన ఆదివాసీల పక్షాన నిలబడుతామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. గుజరాత్‌లోని బురుచ్‌లో ఆప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రీవాల్‌ పాల్గొని ప్రసంగించారు. 

Tags:    

Similar News