Delhi: ఉచిత విద్యుత్‌పై ఆప్ సర్కార్ యూటర్న్

Delhi: ఢిల్లీలో అక్టోబర్ 1 నుంచి కోరిన వారికే విద్యుత్ రాయితీలు

Update: 2022-05-06 02:24 GMT

Delhi: ఉచిత విద్యుత్‌పై ఆప్ సర్కార్ యూటర్న్

Delhi: ఉచిత విద్యుత్ హామీతో ఢిల్లీలో గద్దెనెక్కిన ఆప్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది. విద్యుత్ రాయితీ కావాలో వద్దో ఎంచుకునే అవకాశాన్ని ప్రజలకు కలిపించింది. అక్టోబర్ 1 నుంచి కోరిన వారికి మాత్రమే విద్యుత్ రాయితీలు అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లులు చెల్లించే సామర్థ్యం ఉన్న వారు ఉచిత విద్యుత్‌ పథకంతో పాటు విద్యుత్ రాయితీని వదులుకోవాలని సూచించారు.

ఢిల్లీలో నిరుపేదలకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీంతో 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు వస్తోంది. 201-400 యూనిట్ల వినియోగంపై నెలు 800 రూపాయలు రాయితీ ఇస్తుంది. 2015 ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్, ఉచిత తాగునీటి పథకాలపై కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. ఉచిత విద్యుత్, విద్యుత్‌పై రాయితీ పథకం అమలు కోసం 2022-23 లో కేజ్రీవాల్ సర్కార్ 3వేల 340 కోట్ల నిధులు బడ్జెట్‌లో కేటాయించింది.

ఎండాకాలంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కరెంట్ సంక్షోభం నెలకొంది. ఢిల్లీలోని మెట్రో రైళ్లతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రభావం చూపింది. 

Full View


Tags:    

Similar News