Kejriwal: సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు
Kejriwal: ప్రభుత్వ నిధులను మన దేశస్తులకు వెచ్చించకుండా..పాకిస్తానీలకు ఖర్చు చేయాలని చూస్తున్నారని ఫైర్
Kejriwal: సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు
Kejriwal: సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిధులను మన దేశస్తులకు వెచ్చించకుండా పాకిస్తానీలకు ఖర్చు చేయాలని చూస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేక.. సీఏఏను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు కేజ్రీవాల్. యువతకు ఉపాధి, పేదలకు వసతిపై ఆలోచన చేయకుండా సీఏఏ గురించి మాట్లాడటం బాధాకరమన్నారు. మన దేశయువతకే ఉపాధి కల్పించలేని కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్ మైనారిటీలకు ఉద్యోగాలు ఇస్తామని ఎలా చెబుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.