Arvind Kejriwal: వాయు కాలుష్యంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్
Arvind Kejriwal: ఇది కేవలం ఢిల్లీ, పంజాబ్ సమస్య మాత్రమే కాదు
Arvind Kejriwal: వాయు కాలుష్యంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్
Arvind Kejriwal: వాయు కాలుష్యంపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఫైరయ్యారు. వాయు కాలుష్యం ఉత్తర భారతదేశ సమస్యని ఆప్, ఢిల్లీ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించవని స్పష్టం చేశారు. వాహనాలకు సరి-బేసి సిస్టం అమలు చేయాలా..? వద్దా..? అనే ఆలోచన చేస్తున్నామన్నారు. రేపటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నామని కేజ్రీవాల్ ప్రకటించారు. కాలుష్య పరిస్థితి మెరుగుపడే వరకు ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు మూసివేస్తున్నట్లు చెప్పారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.