Farmers Protest: చ‌ర్చ‌లు విఫ‌లం, నేటి నుంచి మ‌రోసారి `ఢిల్లీ చ‌లో`కి రైతుల పిలుపు

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

Update: 2024-02-21 04:57 GMT

Farmers Protest: చ‌ర్చ‌లు విఫ‌లం, నేటి నుంచి మ‌రోసారి `ఢిల్లీ చ‌లో`కి రైతుల పిలుపు

Farmers Protest: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై వత్తిడి చేస్తున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. ఢిల్లీ చలో మార్చ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.

దాదాపు 15 వేల మంది రైతులు 12 వందల ట్రాక్టర్లు, మూడు వందల కార్లు, పది మినీ బస్సుల్లో ఢిల్లీకి పయనం అయ్యారు. పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో భధ్రతను కట్టుదిట్టం చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారులపై ట్రాక్టర్లను అనుమతించ వద్దని పోలీసులు ఆదేశాలు జారి చేశారు. జాతీయ రహాదారులపై ట్రాక్టర్లు నడపడం వాహన చట్టానికి వ్యతిరేకమని కోర్టు సూచించింది.

Tags:    

Similar News