Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడు: పెరిగిన మృతుల సంఖ్య
Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడు: పెరిగిన మృతుల సంఖ్య
Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరిగినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.
పేలుడు జరిగిన వెంటనే తొమ్మిది (9) మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య మొత్తం 12కు చేరింది.
ఈ ఆత్మాహుతి దాడి లేదా ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. ఈ పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది.