Raipur: ఆస్పత్రిలో నేల మీద, స్ట్రెచర్లపై మృతదేహాలు

Raipur: శ్మశానాల్లో కొన్ని.. బయట అంబులెన్స్‌ల్లో మరికొన్ని మృతదేహాలు నిరంతరం రగులుతున్న చితిమంటలు..!

Update: 2021-04-14 10:08 GMT

Raipur: ఆస్పత్రిలో నేల మీద, స్ట్రెచర్లపై మృతదేహాలు

Raipur: శ్మశానాల్లో కొన్ని.. బయట అంబులెన్స్‌ల్లో మరికొన్ని మృతదేహాలు నిరంతరం రగులుతున్న చితిమంటలు..! నిండిపోయిన ఆస్పత్రుల శవాగారాలు వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని, స్ట్రెచర్లపై మరికొన్ని శవాలు..! పెద్దఎత్తున పేరుకుపోతున్న మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దహనవాటికల సామర్థ్యం పెంపు..! కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతితో పలు రాష్ట్రాల్లో నెలకొన్న దైన్యమిది.

ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, ఢిల్లీల్లో పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. రాయ్‌పూర్‌ ఆస్పత్రిలోని కరోనా రోగుల్లో లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో అక్కడి సిబ్బందికి తెలియడం లేదు. చెప్పాలంటే మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు. దీంతో స్ట్రెచర్లపై, మార్చురీ బయట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉంచుతున్నారు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత కరోనా రోగుల ప్రాణాలను హరిస్తోంది. ముంబై సమీప పాల్ఘర్‌ జిల్లాలో రెండు ఆస్పత్రుల్లో పదిమంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌ రాజధాని బోఫాల్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఓ ఆస్పత్రిలో నలుగురు, మరోదాంట్లో ఓ మహిళా మృతిచెందింది. ఇక గుజరాత్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నానో సైన్సెస్‌ విభాగం డీన్‌ ఇంద్రాణీ బెనర్జీ ఓ ఆస్పత్రిలో రోగులు నిండిపోవడంతో మరోచోట చేర్చుకోకపోవడంతో ఇంకోచోట ఆక్సిజన్‌ వసతి లేకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయారు.


Tags:    

Similar News