Cyclone Yaas: తూర్పు తీరం వైపు దూసుకొస్తున్న యాస్‌ తుపాను

Cyclone Yaas: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.

Update: 2021-05-25 05:18 GMT

యాస్‌ తుపాను(The Hans India)

Cyclone Yaas: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆ తర్వాత 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి, రేపు ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటేందుకు ఎక్కువ ఛాన్స్‌ ఉందని, తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

యాస్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఏపీ తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్‌ ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తీవ్రత కొనసాగుతుందన్న ఐఎండీ.. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 26న తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్రలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇవాళ, రేపు, ఎల్లుండి ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. యాస్‌ తుపాను దృష్ట్యా సముద్రంలోకి చేపల వేటకు మత్స్యకారులు వెళ్లొద్దని హెతూర్పు తీరం వైపు దూసుకొస్తున్న యాస్‌ తుపానుచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇక.. యాస్‌ సైక్లోన్‌ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. యాస్‌ తుపానును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని తుపాను ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలను సూచించింది. కేంద్ర శాఖలు అన్ని విధాలుగా సహకరిస్తాయని హామీ ఇచ్చింది. సాధ్యమైనంతమేరకు విద్యుత్పత్తి కేంద్రాల్లో సరఫరా నిలిచిపోకుండా చూడాలని కోరింది. మత్స్యకారులను సముద్రం నుంచి వెంటనే వెనక్కి పిలిపించాలని, లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని తెలిపింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌ పని చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు.. యాస్‌ తుపాను కారణంగా రైళ్లు, విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను రద్దు చేసిన కేంద్రం, వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వందకు పైగా రైళ్లను నిలిపివేసింది. 

Tags:    

Similar News