CWC Meeting: ఇవాళ సీడబ్ల్యూసీ భేటీ
CWC Meeting: అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఆమోదం కోసమే
CWC Meeting: ఇవాళ సీడబ్ల్యూసీ భేటీ
CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ మధ్యాహ్నం 3న్నర గంటలకు సమావేశం కానుంది. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంపై సీడబ్ల్యూసీ సభ్యులు ఈ సమావేశంలో విశ్వాసం ప్రకటించే అవకాశం కూడా ఉంది.
వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమెకు తోడుగా వెళ్లిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా వర్చువల్‌గా సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు నిర్వహించనున్న భారత్ జోడో యాత్రకు రాష్ర్టాలవారీగా సమన్వయకర్తలను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆంధ్రప్రదేశ్‌కు డాలీ శర్మ, తెలంగాణకు ఎస్‌వీ రమణి ఇన్‌చార్జులుగా నియమించినట్టు పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా పేర్కొన్నారు.