Petrol, Diesel Price Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel Price Today: దేశంలో పెట్రో ధరలు స్థిరంగానే కొనసాగుతునప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2021-04-25 02:03 GMT

Petrol, Diesel price Today

Petrol, Diesel price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా.. ఆదివారం 94.13 కి పెరిగింది. డీజిల్‌ ధర రూ.88.18 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.01 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.62 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.14 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.60 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.14 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.77 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.22గా ఉంది.

Tags:    

Similar News