CP Radhakrishnan: గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా

CP Radhakrishnan: మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2025-09-11 10:03 GMT

CP Radhakrishnan: గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా

CP Radhakrishnan: మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల దేశ నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

రాధాకృష్ణన్ రాజీనామాతో ఖాళీ అయిన మహారాష్ట్ర గవర్నర్ పదవికి, గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్‌తో ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక:

జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి కొత్త ఉపరాష్ట్రపతిని కలిసి అభినందనలు తెలిపారు.

రాధాకృష్ణన్ వ్యాఖ్యలు:

మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ, తాను రాజీపడని జాతీయవాదినని పేర్కొన్నారు. "గవర్నర్‌గా నేను ఇక్కడ గడిపిన 13 నెలలు నా ప్రజా జీవితంలో ఎంతో సంతోషకరమైనవి. పరిపాలనాపరంగా, రాజకీయంగా ఈ రాష్ట్రం నాకు ఎంతో నేర్పింది" అని తెలిపారు.

Tags:    

Similar News