12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్‌లు

ఇప్పటికే 15-18 ఏళ్లలోపు పిల్లలకు కొనసాగుతున్న టీకాల పంపిణీ

Update: 2022-01-18 04:22 GMT

12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్‌లు

Covid Vaccination for 12-14 Age Group: కరోనా మహమ్మారిపై పోరులో భారత్ కీలక మైలురాళ్లను దాటుతోంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై జనవరి 16తో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి 15 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు కూడా టీకాల పంపిణీ కూడా మొదలైంది. మరోవైపు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల పాలిట ప్రమాదకారిగా మారడంతో కౌమారదశలోని పిల్లలు అందరికీ వ్యాక్సిన్లు అందించే దిశగా భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

పిల్లల కొవిడ్ టీకా డ్రైవ్ పరిధిని విస్తరిస్తూ 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్లు అందించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి కొవిడ్ 19 ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్.కే అరోరా కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ఇక జనవరి 3న 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు వారికి మొదటి డోస్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News