శీతా కాలం కరోనా కాలమే.. అసలు ఎలా ఉంటుందో అంచనా వేయడమే..

Update: 2020-06-05 07:04 GMT

ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే. అసలు సినిమా ముందుంది. అది హర్రర్‌ మూవీని మించి భయపెట్టవచ్చు. అది ఎలా ఉంటుందో తలచుకుంటునే వెన్నులో వణుకుపుడుతుంది. ప్రతి రాష్ట్రం అమెరికాలా మారొచ్చు ప్రతి నగరం వూహాన్‌లా మారొచ్చు. ప్రతిపల్లె ఓ ఇటలీని తలపించవచ్చు. రానుంది చలికాలం. వ్యాధులు విస్తరించేందుకు అనువైన కాలం ఈ టైంలో కరోనా ఉగ్రరూపం దాలిస్తే దేశం తట్టుకోగలదా లెట్స్‌ వాచ్‌ద స్టోరీ

శీతా కాలం కరోనా కాలమే. దేశంలో విజృంభించనున్న వైరస్‌. సీజనల్‌ వ్యాధిగా మారనున్న మహమ్మారి.

వ్యాక్సిన్‌ లేని వైరస్‌ మెల్లగా పోయిందిలే అనుకుంటున్నారా అంతలేదమ్మ అది ఎక్కడికి పోదు. మనతోనే మన మధ్యే ఉంటూ మనతో సహజీవనం చేసోంది. లాక్‌డౌన్‌తో చిన్న బ్రేక్‌ తీసుకుంది అంతే. మొన్నటి వరకు మెల్లగా విస్తరించిన వైరస్‌ ఒక్కసారిగా లాక్‌ ఒపెన్‌ కావడంతో వీరలెవల్‌ లో విజృంభిస్తోంది. ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న వైరల్‌ దాడి చలికాలంలో మాములుగా ఉండదని అసలు ఎలా ఉంటుందో అంచనా వేయడమే కష్టమని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సీజనల్‌ వ్యాధులకు కరోనా తోడైతే ఇక మహా ప్రమాదమే ముందుందంటున్నారు శాస్త్రవేత్తలు. గతంలో ప్రపంచదేశాలను గడగడలాంచిన మహమ్మారి జబ్బులు కూడా కరోనా విశ్వరూపాన్ని చూసి భయపడిపోవచ్చని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్న హెచ్చరికలు వింటే ఏసీ రూముల్లో కూర్చొన్న చెమటలు పట్టుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న మూడు నెలులు ఒక లెక్క రానున్న రోజులు మరో లెక్క అన్నట్లు తయారుకావడం తప్పదని హెచ్చరిస్తున్నారు.

భౌతికదూరం పాటిస్తున్నా శానిటైజర్‌ రాస్తున్నా చలికాలంలో శ్రుతిమించే ప్రమాదముందని ప్రతి ఒక్కరూ జడుసుకుంటున్నారు . వాతావరణంలో తేమ శాతం తగ్గినప్పుడు కరోనా కేసులు ఆరు శాతం పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లు చిన్నగా మారి గాలిలో ఎక్కువ సేపు ఉంటుందని అప్పుడు ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే శీతకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని లేదంటే చలికాలం ఘోరకలి చూడక తప్పదని సూచిస్తున్నారు. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటే తుంపర్లు పెద్దవిగా, బరువుగా ఉండి వెంటనే నేలపై పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

 ప్రస్తుతం దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోందని రానున్న రోజుల్లో మరింత ముప్పు వస్తుందని అలర్ట్‌ చేస్తున్నారు. చలికాలం కరోనాకు అనుకూలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, పెద్ద ఎత్తున టెస్టింగులు చేపట్టడం ఒక్కటే ఇప్పుడు మన ముందున్న మార్గం లేదంటే దేశం మరభూమిని తలపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Full View


Tags:    

Similar News