Corona Second Wave: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రాణాంతకమైనది.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్

Corona Second Wave: ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికీ తీవ్ర ఆందోళన కలిగిస్తోందనీ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారు.

Update: 2021-05-15 02:53 GMT

Corona Second Wave:(File Image) 

Corona Second Wave: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రాణాంతకమైనది అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు. గతేడాది మొదటిసారి వచ్చిన మహమ్మారి కంటే... ఈ సంవత్సరం సెకండ్ వేవ్ అత్యంత ప్రాణాంతకమైనది అని ఆయన అన్నారు. ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు వేల కొద్దీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, టెంట్స్, మౌబైల్ ఫీల్డ్ హాస్పిట్స్, మాస్కులు, ఇతర వైద్య పరికరాల్ని నౌకల ద్వారా సప్లై చేసినట్లు టెడ్రోస్ తెలిపారు.

ప్రస్తుతం ఇండియాతోపాటూ... నేపాల్, శ్రీలంక, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, ఈజిఫ్టు వంటి కొన్ని దేశాల్లో కరోనా కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది అన్నారు. గత వారం మొత్తం కరోనా మరణాల్లో 40 శాతం అమెరికావే ఉన్నాయని అన్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అమెరికాలో ఇంకా కరోనా కేసులు పూర్తిగా తగ్గనేలేదు... కానీ 2 డోసులు వేసుకున్న వారు మాస్కులు వాడాల్సన పని లేదని అక్కడి జో బిడెన్ ప్రభుత్వం చెప్పేసింది. ఆఫీసులు, బయటి ప్రదేశాల్లో మాస్కులు వాడాల్సిన పనిలేదని చెప్పింది. సేఫ్ డిస్టాన్స్ మాత్రం పాటించమని సూచించింది. మరి దీని వల్ల మళ్లీ అక్కడ కేసులు పెరుగుతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇండియాలో కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి చేరింది. కొత్తగా 4,000 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,62,317కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,44,776 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,00,79,599కి చేరింది. రికవరీ రేటు 83.5 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 37,04,893 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,75,515 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 31 కోట్ల 13 లక్షల 24వేల 100 టెస్టులు చేశారు. కొత్తగా 20,27,162 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 17కోట్ల 92లక్షల 98వేల 584మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Tags:    

Similar News