Coronavirus: యువతపైనే కరోనా దాడి అధికం

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,575 చేరింది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Update: 2020-04-05 03:36 GMT

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,575 చేరింది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 30 శాతం ఢిల్లీ లింకులు ఉన్నవేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా వైరస్ బాధితుల్లో అత్యధికంగా యుక్త వయసులో ఉన్న వారేనని ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం దేశంలో కరోనా బారిన పడుతున్న వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

మన దేశంలోని కోవిడ్19 బాధితుల్లో 20 ఏళ్లలోపు వారు 9 శాతం మంది ఉండగా.. 21-40 ఏళ్ల మధ్య వయసులో 42 శాతం మంది ఉన్నారు. 41-60 ఏళ్ల వారు 33 శాతం మంది ఉన్నారు. 17 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

కేరళ, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో, 58 మంది పరిస్థితి విషమంగా ఉందని అగర్వాల్ చెప్పారు. ఇతర దేశాల్లో వృద్ధులు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. దేశంలోనే 60 శాతం బాధితులు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం గమనార్హం.

ఇప్పటివరకు సంభవించిన మరణాలు మధుమేహం, హైపర్ టెన్షన్, కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులే ఉన్నారని వివరించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నందున ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కేసు రెట్టింపయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. 

Tags:    

Similar News