Mizoram: కాసేపట్లో మిజోరం ఓట్ల లెక్కింపు

Mizoram: ఉ.8 గంటల నుంచి ప్రారంభం

Update: 2023-12-04 01:53 GMT

Mizoram: కాసేపట్లో మిజోరం ఓట్ల లెక్కింపు 

Mizoram: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టనున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వాస్తవానికి ఆదివారం తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌తోపాటు మిజోరం ఓట్ల లెక్కింపు కూడా చేపట్టాల్సి ఉన్నది.

అయితే ఆదివారం తమకు ప్రత్యేక దినమని, ఆ రోజు కౌంటింగ్‌ వద్దంటూ ఆ రాష్ట్ర ప్రజలు, పలు సంస్థలు చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్‌ ప్రక్రియను సోమవారానికి వాయిదా వేసింది. 40 సీట్లున్న మిజోరంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరుగగా, ప్రధానంగా అధికార ఎంఎన్‌ఎఫ్‌తో పాటు జడ్‌పీఎం, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడ్డాయి.

Tags:    

Similar News