దేశంలో నేటికి 3374 కరోనా పాజిటివ్ కేసులు, 79 మంది మృతి

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే..

Update: 2020-04-05 14:53 GMT
Agarwal (File Photo)

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయినప్పటకి దేశంలో కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు.. ఆదివారం నాటికి భారత్ లో కరోనా కేసుల సంఖ్య 3374కు చేరుకున్నది. 79 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఇక కరోనా వైరస్ వలన దేశ‌వ్యాప్తంగా 274 జిల్లాలు ప్రభావానికి గురైన‌ట్లు అయన పేర్కొన్నారు.

నిన్నటి నుంచి కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదు అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గ‌త 24 గంట‌ల్లో 11 మంది చ‌నిపోయార‌ని, 267 మంది వైర‌స్ నుంచి కోలుకున్నట్లు అయన తెలిపారు. కరోనా వైరస్ పై విజయం సాధించడానికి సామజిక దూరం ప్రజలు తప్పకుండ పాటించాలని అయన కోరారు.

Tags:    

Similar News